ఇర‌వై నిమిషాల‌కే రూ. 4 కోట్లా.. శృతి హాస‌న్ మామూల్ది కాదురా బాబు!?

టాలీవుడ్ లో గ‌త కొంత కాలం నుంచి బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న అందాల భామ శృతి హాస‌న్‌.. ప్ర‌స్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న‌` అనే సినిమాలో న‌టిస్తోంది. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

అలాగే నాని కూతురుగా ఇందులో కియారా ఖన్నా అనే చిన్నారి న‌టిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 21న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీలో నాని భార్యగా ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపిస్తుంది.

శృతి హాస‌న్ కు ఇర‌వై నిమిషాల కంటే త‌క్కువే స్క్రీన్ టైమ్ ఉంటుందట‌. సినిమా లో ఆమె పాత్ర కొద్దిసేపే అయినా చాలా ఇంప్యాక్ట్ కలిగించేలా ఉంటుందని.. నాని శృతి హాసన్ మధ్య సీన్స్ చాలా బాగుంటాయని తెలుస్తుంది. మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఇర‌వై నిమిషాల పాత్ర కోసం శృతి హాస‌న్ ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. మెయిన్ హీరోయిన్ కాక‌పోయినా శృతి ఈ రేంజ్ లో ఛార్జ్ చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.