ఈ వయసులో పెళ్ళి కావాలంటున్న సీనియర్ హీరోయిన్.. త్వరలోనే అంటూ ..!

తెలుగు, తమిళ్, మలయాళం , కన్నడ , హిందీ , భోజ్ పురి, బెంగాలీ, పంజాబీ, మరాఠీ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తన అందంతో, నటనతో యువతను తన వైపు తిప్పుకున్న ప్రముఖ స్టార్ సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అన్ని భాషలలో కూడా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత తల్లి , అత్త పాత్రల్లో కూడా మెరిసింది.

Nagma Opened Up About Her Affair With Sourav Ganguly

ఇకపోతే తెలుగు వెండితెరకు దూరమై 20 సంవత్సరాలు అవుతోంది. 2008లో రాజకీయాలకు ఆరంభం పలికిన నగ్మా.. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంతోమంది హీరోలతో ప్రేమాయణం నడిపింది. కానీ ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా నిలిచిపోయింది.. 48 సంవత్సరాల వయసున్న ఈమె ఇప్పుడు ఈ వయసులో తనకు పెళ్లి కావాలి అంటూ కామెంట్లు చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నగ్మ తన పెళ్లిపై కామెంట్లు చేసింది.

” పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు కూడా ఉంది. ముఖ్యంగా నాకు కూడా ఒక తోడు కావాలి. పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి.నాకు పిల్లలు కావాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. కానీ కాలం కలిసి రాలేదు. ఒకవేళ ఆ కాలమే కలిసి వస్తే.. త్వరలోనే నా పెళ్లి జరిగి నాకంటూ ఒక కుటుంబం ఏర్పడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషం అనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా. నాకు కావాల్సిన తోడు దొరికితే ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను” అంటూ తెలిపింది నగ్మా . ప్రస్తుతం నగ్మా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.