అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో ఎ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు నిన్నటి రోజు నుంచి చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేసిన ఫోటోలలో తన మనవడు కార్తికేయ, అకీరానందన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది రాఘవేంద్రరావు.

Renu Desai | Akira Nandan not interested in becoming a hero.. Renu Desai on  rumours-Namasthe

షేర్ చేసిన ఫోటోలు తన మనవడు కార్తికేయ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ ఇద్దరు కూడా అమెరికాలో ఫిలిం స్కూల్లో చేరారని తెలియజేశారు. అయితే ఈ ట్విట్ చేసిన కొద్దిసేపటికి తొలగించడం జరిగింది.. అప్పటికే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో చూసి అభిమానుల సైతం తెగ మురిసిపోయారు.. త్వరలోనే అకిరా ఎంట్రీ ఉండబోతుందనే విషయం వైరల్ గా మారింది. ఈ విషయం తల్లి రేణు దేశాయ్ దృష్టికి వెళ్లగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

రేణు దేశాయ్ ఇలా తెలియజేస్తూ ప్రస్తుతం అకిరాకు నటన పైన ఆసక్తి లేదు.. హీరో కావాలని అనుకోవడం లేదు భవిష్యత్తును ఇప్పుడే ఊహించలేము నేను ఏదైనా పోస్ట్ చేస్తే దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఊహగానాలు ఆపేయండి..ఒకవేళ అకిరా సినిమాలలోకి రావాలనుకునే నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని కచ్చితంగా మీతోనే చెబుతాను అంటూ రేణు దేశాయ్ తెలియజేసింది. దీంతో అకిరా సినీ ఎంట్రీ పై కేవలం ఇవన్నీ ఒట్టి రూమర్సే అంటూ అభిమానుల సైతం నిరుత్సాహపడుతున్నారు.