ఇప్పటికి మహేశ్ కి ఆ కోరిక తీరలేదా..? అంత ఓపెన్ గా చెప్పేశావ్ ఏంటి బాసు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అందానికి అందం .. నటనకి నటన.. మంచితనానికి మంచితనం.. ఏ క్వాలిటీస్ ఎంత ఏ రేంజ్ లో ఉండాలో పర్ఫెక్ట్ గా ఉండే పర్ఫెక్ట్ హీరో అని చెప్పాలి. అయితే రీసెంట్గా మహేష్ బాబుకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు .. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్స్ ప్రాజెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు.

ఇలాంటి క్రమంలోనే మహేష్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ కి నాగార్జున గారిలా భక్తి పాత్రలో కనిపించాలని ఉంది అనే కోరికను బయట పెట్టాడు . ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసినా..ఒక్క సినిమాలో కూడా అలా భక్తి పాత్రలో కనిపించలేదు .

అలాంటి కథను కూడా ఇంతవరకు మేకర్స్ డైరెక్టర్స్ ఎవరూ మహేష్ బాబు వద్దకు తీసుకెళ్లలేదు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఆ కోరిక ఇంకా తీరకుండా అలానే ఉండిపోయింది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకు రావడంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ కోరిక తీర్చే డైరెక్టర్ లు ఇండస్ట్రీలో లేరా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!