పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ చెప్పుకున్న సౌత్ స్టార్ కపుల్స్ ఎవరో మీకు తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోయిన్‌లు, హీరోలు ప్రేమలు, పెళ్లిళ్లు విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాలపై సినీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ తెలుసుకోవాలని ఆశపడుతూుంటారు. ఇప్పుడు మన సౌత్ చిత్ర పరిశ్రమలోనే కొంతమంది స్టార్ హీరోయిన్లు, హీరోలు ఎంగేజ్మెంట్ చేసుకున్ని మరి పెళ్లి వరకు వెళ్తారు అనుకుంటే మధ్యలోనే వారి బంధానికి ముగించేశారు. మధ్య‌లోనే బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన సౌత్ స్టార్ కపుల్స్ ఎవరో ఒకసారి ఇక్కడ చూద్దాం.

ముందుగా అక్కినేని యువ‌ హీరో అఖిల్ నాగార్జున తనయుడిగా టాలీవుడ్ లో అఖిల్ సినిమాతో తన కెరీర్‌ను మొదలు పెట్టాడు. తొలి సినిమాతోనే భారీగా బోల్తా కొట్టిన అఖిల్.. ఈ సినిమా విడుదలైన నెలకే పెళ్లికి రెడీ అయ్యాడు. తాను ప్రేమించిన శ్రియ భూపాల్‌తో ఏడడుగులు వేయాలని నిశ్చయించుకున్నాడు. 2016లో ఎంతో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అదే విధంగా ఇటలీలో వీరి పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రాజులకి అఖిల్ శ్రియతో బ్రేకప్ చెప్పేసాడు.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా ఇప్పటికీ సౌత్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కొనసాగుతున్నాడు. అయితే విశాల్‌ గతంలో తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో ప్రేమలో పడ్డాడు. ఆరేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న తర్వాత వీరిద్దరి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్న వీరి బంధం మధ్యలోనే ముగిసింది.

ఇక టాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వ‌రుస సినిమాతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న‌ కూడా ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అయ్యారు. ఆ తర్వాత రష్మికకు ఏం జరిగిందో తెలియదు కానీ వరుస‌ సినిమా అవకాశాలు రావటంతో రక్షిత్ కు గుడ్ బై చెప్పేసింది.

ఇక‌ ఈ చెన్నై సోయ‌గం త్రిష కూడా గ‌తంలో ఎంతో మంది హీరోల‌తో ప్రేమ‌లో న‌డిపిన‌ట్లు టాక్ ఉంది. అయితే బిజినెస్ మెన్, నిర్మాత, తన చిన్ననాటి స్నేహితుడు వరుణ్ మణియన్ ను పెళ్లి చేసుకోవాల‌నుకుంది. ఇద్ద‌రికీ గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ త‌ర్వాత ఏమైదో ఏమో గానీ త్రిష‌, వ‌రుణ్ విడిపోయారు. మెహ్రీన్ అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈపాటికే హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు కాంగ్రెస్‌ నేత భవ్య బిష్ణోయ్ భార్య అయ్యుండేది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఎంగేజ్మెంట్ అయిన త‌ర్వాత వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నారు.