ఎవరికీ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కిట్నే అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సమయంలో ప్రారంభించారు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరి సినిమా ‘ ఇండియన్ 2 ‘ సినిమా ని తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.


శంకర్ నెలలో 15 రోజులు ఇండియన్ 2 సినిమా కి పని చేస్తే మరో 15 రోజులు గేమ్ చేంజర్ సినిమా కోసం పని చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడో ప్రారంభించిన గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవుతుంది వస్తుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక శంకర్ తన సినిమాలో పాటలను ఎంత రిచ్ గ తీస్తాడు అనేది మనందరికీ తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల నుంచి ఆయన పాటలు మనం చూస్తూనే ఉన్నాం. సినిమా బడ్జెట్ లో 50 శాతం పాటలకోసమే ఖర్చు చేస్తుంటాడు శంకర్. అలానే గేమ్ చేంజర్ సినిమా పాటల కోసం కూడా అదే రేంజ్ లో ఖర్చుచేస్తున్నాడు శంకర్.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా లోని 5 పాటల కోసం దాదాపు రూ. 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట దర్శకుడు శంకర్. అంత భారీ బడ్జెట్ కేవలం పాటల కోసమే ఖర్చు చేస్తున్నాడంటే గేమ్ చేంజర్ సినిమా శంకర్ కి ఎంత ముఖ్యమైనదొ అర్ధం అవుతుంది. గేమ్ చేంజర్ సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు దాటుతుందని సమాచారం. అయితే ఈ సినిమా నుండి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ రాకపోవడం తో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు దిల్ రాజు ని ట్యాగ్ చేసి తిట్ల వర్షం కురిపిస్తున్నారు.షూటింగ్ ఆలస్యమవుతున్న కారణం గా సినిమా గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకప్తున్నాం అంటూ ప్రొడక్షన్ టీమ్ కి సంబందించిన వాళ్ళు చెప్తున్నారు.