రొమాంటిక్ ప్లేస్‌లో భార్య ర‌మాతో రాజ‌మౌళి ఎంజాయ్‌… ( ఫొటోలు)

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ సెలబ్రిటీగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఈ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అంటే కేవలం మ‌హేష్‌ ఫ్యాన్సే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా వస్తున్నాయంటే కోట్లాదిమంది ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. దాదాపు ఈ ఏడాది చివరి నుంచి మహేష్ బాబు – రాజమౌళి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి తన భార్యతో కలిపి నార్వే టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బాహుబలి 1
మూవీ స్పెషల్ స్క్రీనింగ్ నార్వేలో స్టావెంజర్ నగరంలో జరగబోతుంది. దీనికోసం సోభు యార్లగడ్డ, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజమౌళి – రమా రాజమౌళి దంపతులు నార్వే ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ ఓ ఆహ్లాదకరమైన ప్లేస్ ను రాజమౌళి అత‌డి భార్య‌ సందర్శించారు. ఎత్తైన పల్పిట్‌ ట్రాక్ హిల్స్ ప్రాంతంలో ప్రకృతి అందాలు వీక్షిస్తూ రాజమౌళి, రమా రాజమౌళి ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో కూర్చోడం కాస్త థ్రిల్లింగ్ గా మరి కాస్త రొమాంటిక్ గా కూడా ఉంటుంది.

ప్రస్తుతం రాజమౌళి, రమా రాజమౌళి ఆ వ్యూలో కూర్చుని దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ అలాంటి టూర్‌కి వెళ్లాలని మగధీర సినిమా షూటింగ్ అప్పుడే అనుకున్నారట. మగధీర మూవీ లొకేషన్స్ వెతుకుతున్నప్పుడే రాక్ హిల్స్ ఫోటోలను చూశారట. అప్పటినుంచి అలాంటి ప్రదేశాన్ని ఇద్దరు కలిసి సందర్శించాలని అనుకునేవారట. ఇక ఇప్పుడు బాహుబలి 1 స్క్రీనింగ్ ద్వారా ఆ కోరిక నెరవేరింది అంటూ జక్కన్న పోస్ట్ చేశారు.