ఆ హీరోయిన్ తో నా కోరిక తీరింది.. బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఓపెన్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మొహ‌మాటం గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొత్త వారితో అస్స‌లు క‌ల‌వ‌లేడు. చాలా లిమిట్ గా మాట్లాడ‌తాడు. ఇక హీరోయిన్స్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌డం మనం చూసి ఉండం. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీపై ప్ర‌భాస్ ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు దీపికా పదుకొణె. `క‌ల్కి 2898 ఏడీ`లో వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. క‌మ‌ల్ హాస‌న్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, దిశా ప‌టానీ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. ఇటీవల అమెరికాలో జరిగిన శాండియాగో కామిక్ కాన్ వేడుకలో ఈ సినిమా టైటిల్ టీజ‌ర్ మేక‌ర్స్ లాంఛ్ చేశారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఇటీవ‌ల ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి అనేక విష‌యాలు పంచుకున్నాడు.

అలాగే త‌న కోస్టార్ దీపికా పదుకొణెపై ఓపెన్ కామెంట్స్ చేశాడు. దీపికా చాలా అందంగా ఉంటారు. ఆమె ఒక అద్భుతం. ప్ర‌పంచ‌మంతా ఫేమ‌స్ అయ్యారు. ఆమె కల్కి సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అంద‌రితోనూ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ణి. ఫైన‌ల్ గా నా కోరిక ఇప్పుడు తీరింది` అంటూ ప్ర‌భాస్ పేర్కొన్నాడు. దీంతో ప్ర‌భాస్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.