ఈ వయసులో నాగచైతన్య అది నేర్చుకుంటున్నాడా..? లెటేస్ట్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాగని డిజాస్టర్ హీరో కాదు.. అలా అని సూపర్ స్టార్ హీరో కాదు ..హీరో అంటే హీరో ..అంతే దాని ముందు ఏదైనా మార్చుకోవచ్చు. అలాంటి ఓ స్దానాని సంపాదించుకున్నాడు. కాగా తన తాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీని ఏలేసిన ఓ స్టార్ హీరో . తండ్రి నాగార్జున ఎంతటి స్టార్ హీరోను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలా ఇద్దరు క్వాలిటీస్ అందిపుచ్చుకున్న నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ హీరోగా మారలేకపోయాడు. దానికి కారణం ఆయనలోని నటన స్కిల్స్ అంటూ పలువురు అక్కినేని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేశారు .

నాగచైతన్యకు పలు సీన్స్ లో నటించడం రాదని .. ఇంకా నటనపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని .. ఎక్కువగా నటించే స్కిల్స్ నేర్చుకోవాలని సజెస్ట్ చేశారు . అయితే ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నాడో ఏమో నాగచైతన్య తెలియదు కానీ ..నిజంగానే నటన నేర్చుకోవడానికి సూపర్ పాపులారిటీ ఆది శక్తి థియేటర్ లో చేరాడు . రీసెంట్గా దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

రీసెంట్గా నాగచైతన్య పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్ వారికి థాంక్యూ చెబుతూ రెండు ఫొటోస్ ను షేర్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ పిక్స్ స్పీడ్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఆదిశక్తి థియేటర్ ఎంతో ఫేమస్ .నటించే వాళ్ళకి ఇది ఓ దేవాలయం అని చెప్పాలి . నటన నేర్పించడానికి ..ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్న కొందరికి నటించే ఎక్స్ప్రెషన్స్ రానివారికి ..ఆదిశక్తి థియేటర్ ది బెస్ట్ ఆప్షన్ . కొత్తగా నటన నేర్చుకోవాలి అన్నా .. లేదా ఇప్పటికే నటులుగా ఉన్నవాళ్లు ఇంకా యాక్టింగ్ స్కిల్స్ ను పెంచుకోవాలి అన్నా ఇక్కడికి వెళుతూ ఉంటారు. తాజాగా నాగచైతన్య సైతం అలాగే చేశాడు. “ఈ హోం వర్క్ తనుకు ఎంతో వర్క్ అవుతుందని” చెప్పుకొచ్చాడు . దీంతో అంత పెద్ద స్టార్ కడుపున పుట్టిన నువ్వు .. ఈ వయసులో ఎలాగ నటించాలో నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళావా..? అంటూ షాక్ అయిపోతున్నారు అభిమానులు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)