టూ పీస్ డ్రెస్ లో పూజా హెగ్డే తెగింపు.. సినిమాల్లేక ఏం చేస్తుందో చూడండి!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేతో బ్యాడ్ టైమ్ బీభ‌త్సంగా బంతాడేస్తోంది. గ‌త ఏడాది కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పూజా హెగ్డే దాదాపు అర డ‌జ‌న్ సినిమాలు చేసింది. కానీ, దుర‌దృష్టం ఏంటంటే.. ఆమె న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా ఆమెకు ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే చేతులో ఉన్న గుంటూరు, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి.

ప్ర‌స్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ వారు కూడా పూజా హెగ్డేను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. సినిమాల్లేక ఖాళీ అయిపోయిన పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో ఆక‌ట్టుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. సోకుల విందుతో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.

తాజాగా బీచ్ బ్యాక్‌గ్రౌండ్ లో టూ పీస్ డ్రెస్ లో మ‌రోసారి తెగింపు చూపించింది. పొడుగుకాళ్లతో మ‌త్తుగా చూస్తూ మెంట‌లెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూస్తుంటే.. పూజా హెగ్డే ఇప్పుడు మాల్దీవ్స్ వెకేష‌న్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక అందాల‌తో ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ పూజా హెగ్డే.. మ‌ళ్లీ మునుప‌టిలా వ‌రుస సినిమాల‌తో ఎప్ప‌టికీ బిజీ అవుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)