స్టార్ క్రికెట‌ర్‌తో సీక్రెట్ డేటింగ్ చేస్తోన్న నిధి అగ‌ర్వాల్‌…!

సవ్యసాచి.. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నిధి అగర్వాల్. నాగచైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమా ఓ మోస్తారు హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నిధి నటించింది. కానీ ఈమె నటించిన అన్ని సినిమాలో కేవ‌లం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

అయినా నిధికి ఏమాత్రం అవకాశాలు తగ్గలేదు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం నిధి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేస్తుందంటూ.. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో నిధి అగర్వాల్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి.

వీరిద్దరు ప్రైవేట్ పార్టీలు, పబ్‌ల‌లో తిరిగి పిక్స్‌ను స్వయంగా వారే సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్త మరింత బలపడింది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో రాహుల్ ఫ్యాన్స్ ఈ న్యూస్ పై ఫైర్ అవుతున్నారు.