గుట్టు చ‌ప్పుడు కాకుండా నిత్యామీన‌న్ పెళ్లి.. ఏం చేస్తుందో చూడండి..!

స్టార్ హీరోయిన్ నిత్యమీనన్.. గత కొంతకాలంగా ఇమే పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయం గురించి నిత్య మీన‌న్ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించలేదు. ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇవ్వబోతుందంటూ అభిమానులు భావిస్తున్నారు. కాగ గతంలో నిత్యమీనన్ తన పెళ్లి పై వచ్చిన వార్తలను ఎన్నోసార్లు ఖండిస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చింది.

ప్రస్తుతం తమిళ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి విషయం బాగా వైరల్ అవుతుంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొంతమంది త‌మిళ ఇండస్ట్రీకి చెందిన వారే కామెంట్స్ చేయడంతో అయితే నిత్యమీనన్ పెళ్లి వార్త నిజమేనంటూ భావిస్తున్నారు నెటిజెన్‌లు. నిత్యమీన‌న్‌ చివరిగా తెలుగులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో మాత్రమే కనిపించింది. ఇక నిత్యమీనన్ తన చిన్ననాటి స్నేహితుడైన ఓ మలయాళ హీరోతో ఎన్నో రోజుల నుంచి ప్రేమలో ఉందంటూ, అతనిని పెళ్లి చేసుకోబోతుందంటూ, పెళ్లి కూడా ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక వీరిద్దరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటినుంచో తెలుసట. సినిమాల్లో అవకాశాలు రావేమో అన్న ఉద్దేశంతో నిత్యమీనన్ తను పెళ్ళిపై వచ్చిన వార్తలను ఖండిస్తూ వాయిదాలపై వాయిదాలు వేస్తూ వచ్చిందని టాక్. ఇక ఇటీవల అవకాశాలు తగ్గడంతో నిత్యమీనన్ వివాహం చేసుకొని పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తుందట. దీంతో పాటే ఎప్పుడు పెళ్లి వార్తలు ఖండించే నిత్య ఈ సారి సైలెంట్ గా ఉండడంతో ఈ రూమర్స్ నిజమేనని భావిస్తున్నారు జనం.