మోస్ట్ అవైటెడ్ ‘ బేబీ ‘ ఓటీటీ రిలీజ్‌… ఎప్పుడు… ఏ ఓటీటీ అంటే..!

బేబీ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మొట్టమొదట చాలా చిన్న సినిమాగా ఎటువంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 14 జులైన దియేట‌ర్స్‌లో రిలీజై భారీ కలెక్షన్లు వసూలు చేయడంతో పాటు కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకుంది.

క్లాసికల్‌ మూవీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా వైష్ణవి చైతన్యకి మెద‌టి సినిమా కావ‌డం విశేషం.
ఆమె నటించిన మొదటి సినిమా నే సూపర్ హిట్ కావడంతో ఆమెకి మంచి అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ ఈ తరం యువతీ, యువకులు ప్రేమ పేరుతో ఎలా మోసపోతున్నారు..? ఏ విధంగా నష్టపోతున్నారు..? అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. దీంతో ఈ సినిమా చాలామందికి యువ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.

ఇక ఎప్పుడెప్పుడు ఓటీటీలో బేబి వస్తుందా అని ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి బేబీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ఆహా. ఓటిటిలో బేబీ మూవీ ఆగస్టు 25న రాబోతున్నట్లు ఈరోజు శుక్రవారం (ఆగస్టు 18) ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చింది ఆహా ఓటిటి సంస్థ.