వాడితో అందుకే విడిపోయా.. ఫ‌స్ట్ బ్రేక‌ప్ పై జాన్వీ క‌పూర్ ఓపెన్ కామెంట్స్‌!

దివంగత నటి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటోషూట్స్ తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. త్వ‌ర‌లోనే `దేవ‌ర‌` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో విడుద‌ల కానుంది.

మ‌రోవైపు బాలీవుడ్ లోనూ హిట్లు, ఫ్లాపుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న జాన్వీ క‌పూర్‌.. తాజాగా స్వైప్ రైడ్ అనే టాక్ షో తాజా ఎపిసోడ్ లో సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. త‌న ఫ‌స్ట్ బ్రేక‌ప్ పై సైతం నోరు విప్పింది.

`నా మొదటి సీరియస్ బాయ్‌ ఫ్రెండ్ ని సీక్రెట్ గా కలుసుకునే దాన్ని. అందుకోసం ఇంట్లో ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వ‌చ్చేది. ఎందుకంటే, మా అమ్మ నాన్న చాలా సంప్రదాయవాదులు. నాకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండకూడదనే అభిప్రాయంతో ఉండేవారు. ఇక ఆ కార‌ణం వ‌ల్లే దురదృష్టవశాత్తూ నా ఫ‌స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక‌ప్ అయింది. అప్పుడే తల్లిదండ్రుల ఆమోదం, వారితో నిజాయతీగా ఉండడం వల్లే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నాను` అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అయితే జాన్వీ క‌పూర్ ఫ‌స్ట్ బ్రేక‌ప్ గురించి చెప్పింది. కానీ, ఫ‌స్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు.