సమంతతో సినిమా అంటే ప్రభాస్ ఎందుకు నో చెబుతున్నాడు… ఆమె అంత పెద్ద తప్పు చేసిందా..!?

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ సమంత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. దాదాపు ద‌శాబ్దాన్న‌ర నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటి ప్రభావం త‌న కెరీర్ పై పడకుండా ఎంతో జాగ్రత్త పడుతుంది. అదేవిధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇదే సమయంలో సమంత తెలుగులో ఉన్న అందరూ స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా అందరితోను సినిమాలు చేసింది. కానీ ఒక్క పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో మాత్రం ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం సమంతతో సినిమా అంటే అసలు ఒప్పుకోవటం లేదట. సమంత అంత పెద్ద తప్పు ఏం చేసింది..? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. ఎందుకు ఇప్పటివరకు సినిమా రాలేదు..? అన్న విషయాలు ఇక్కడ చూద్దాం.

 

తెలుగులోనే మోస్ట్ టాలెస్ట్ హీరోల్లో ప్రభాస్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈయన హైట్ ఏకంగా 6.2 ఇక ప్రభాస్ పక్కన నటించాలంటే హీరోయిన్ ఎత్తు కనీసం 5.5కి పైగా ఉండాలి. ఇప్పటివరకు ప్రభాస్ తో జంటగా నటించిన హీరోయిన్లు అందరి హైట్ ఈ రేంజ్ లోనే ఉంది. కానీ సమంత ఎత్తు 5.2 మాత్రమే హైట్ విషయంలో ప్రభాస్- సమంత మధ్య భారీ తేడా ఉంది. సినిమాల్లో సమంతకు తాను జంటగా నటిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు అన్న భావన ప్రభాస్ లో ఉందట. అందుకే తన సినిమాలకు హీరోయిన్‌గా సమంత పేరు ఎప్పుడు ఛాయిస్ గా వచ్చిన ప్రభాస్ వద్దని చెప్పేవాడట. దర్శకులు ఎంత చెప్పినా ప్రభాస్ అసలు వినేవాడు కాదట. అందుకే ప్రభాస్- సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో కూడా సమంతతో సినిమా చేసే ఆలోచన ప్రభాస్‌కు అసలు లేదట.