ఆ హీరోయిన్ నటిస్తే సినిమా డిజాస్టర్.. టాలీవుడ్లో మరో ఐరన్ లెగ్ అంటూ..?

నిన్న మొన్నటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డేని పిలిచేవారు. పూజా హెగ్డే నటించిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్‌లు కావడంతో నెటి.న్స్ ఈమెపై ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ జాబితాలో హీరోయిన్ సాక్షి వైద్యని కూడా యాడ్ చేశారు కెటిజన్స్. సాక్షి న‌టిస్తే సినిమా రిజల్ట్ దారుణంగా ఉంటుందని.. సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అఖిల స‌ర‌సన ఏజెంట్, వరుణ్‌తేజతో గాంఢీవ దారి అర్జున్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అఖిల్ సినిమా ఫుల్ రన్ కలిపి రూ5. కోట్లు కూడా వసూలు చేయలేదు. ఇక వరుణ్ తేజ్ గాంఢీవ‌దారి సినిమా ఫస్ట్ రోజు కేవలం కోటి రూపాయల కంటే తక్కువ కలెక్షన్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన సాక్షి వైద్య నటించబోతుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్.. సాక్షి వైద్య పవన్ సినిమాలో నటించకపోతే బాగుండని కోరుకుంటున్నారు.

ఈమె నటినపరంగా 100% ఇస్తుందనట‌. చిన్న వయసులో కెరీర్‌ని మొదలుపెట్టిన సాక్షి వైద్య తన ఫ్యూచర్లో ఇండస్ట్రీలో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న సాక్షి వైద్య.. రెమ్యున‌రేష‌న్‌ కూడా చాలా తక్కువగానే తీసుకుంటుందట. దీంతో కొత్త ఆఫర్లు ఇవ్వడానికి డైరెక్టర్ ఆసక్తి చూపుతారు.. లేదో.. చూడాలి. రాబోయే రోజుల్లో సాక్షి వైద్య గోల్డెన్ లెగ్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.