వెంకీ మామ “ సైంధవ్ ” నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ( వీడియో )

టాలీవుడ్ టాప్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూవీ సైన్ధవ్. వెంకీ మామ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అదిరిపోయే కంటెంట్ తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మూవీ మేకర్ లేటెస్ట్‌గా సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. చాలా మంది ప్ర‌ముక యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరందరిపై ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో వెంకటేష్, నావాసుద్దీన్ సిద్ధిక్, రుహాణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా, జెరిమియాతో పాటు హెల్పింగ్ ఆర్టిస్ట్ జయప్రకాష్, సారాలు కనిపిస్తున్నారు.

సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నిహారిక ఎంటర్టైనర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ రూపొందుతుంది. ఈ సినిమాతో వెంకీ మామ ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకుని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక 22 డిసెంబర్ 2023న‌ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.