HBD : పుష్ప-2 నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫాహద్ ఫాజిల్ అంతకుమించి..!!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి మొదటి భాగం భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు చిత్ర బృందం. అలాగే తెరపైకి ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని చిత్ర బృందం ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. పుష్ప సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా మొదట రాసుకున్న స్క్రిప్ట్ ని కూడా చేంజ్ చేసి సుకుమార్ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా కొనసాగింది. ఈ మధ్యనే కాస్త బ్రేకులు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా అనుకున్నట్లుగానే పూర్తి చేసేలా సుకుమార్ మాత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ పుష్ప మొదటి భాగంలో చివరిలో వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నారు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుతంగా నటించిన స్వహద్ అల్లు అర్జున్ కి సరైన పోటీ అని మొదటి భాగంలో వీరి మధ్య జరిగిన సన్నివేశాలను చూస్తే మనకు అర్థమవుతుంది.

ఈ రోజున ఫహార్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. బర్తడే విషెస్ అందిస్తూ బన్వర్ సింగ్ షెకావత్ ఈసారి మరింత రఫ్ గా కనిపించబోతున్నారని పోస్టర్ తో తెలియజేశారు. నల్ల కళ్ళజోడు పెట్టుకుని గుండుతో కనిపిస్తున్నారు..అలాగే సిగరెట్ తాగుతూ అతని హావభావాలు కూడా చాలా వైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విలన్ పుష్ప రాజును ఎలా ఢీ కొంటారు అని ఊహతోనే సుకుమార్ ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. పుష్ప -2 సినిమా షూటింగ్ ని ఈ ఏడాది చివరిలో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.