బిగ్‌బాస్-7లో పాటిస్పేట్ చేయనున్న నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. ఆమె ఎవరంటే..

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి. అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడం తో ఆరవ సీసన్ వరకు వచ్చింది బిగ్ బాస్ . బిగ్ బాస్ షో ని ప్రేక్షకులు ఎంతగానో ఆధరిస్తున్న కారణంగా రకరకాల రంగాల నుండి సెలెబ్రేట్ వచ్చి జనాలను ఏంటర్టైన్ చేస్తూ ఉంటారు .

ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ షో కి హోస్టులుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున లు నిర్వహించారు. అయితే చివరి 4 సీజన్లకు మాత్రం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో నాలుగో సీజన్ హీట్ అయినట్లుగా మరే సీజన్ హిట్ అవ్వలేదు. ఇక ఆరవ సీజన్ అయితే అసలు ఎంటర్టైనింగ్ గా లేదంటూ ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఈ సీజన్ కి టిఆర్పి రేటింగ్ కూడా బాగా పడిపోయింది. అందుకే 7వ సీజన్ అయినా మంచి హిట్ సాధించేలా చెయ్యాలి అని స్టార్ మా టీమ్ బాగా కష్టపడుతున్నారు.దానికి తగ్గట్టుగా కొత్త కొత్త ఐడియాలను, ట్విస్ట్ లు, టాస్కులు, కంటెంట్ సీజన్ 7 లో జోడిస్తున్నారు.

సెప్టెంబర్ లో మొదలు కాభోతున్న బిగ్ బాస్ సీజన్ 7 లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రాభోయే సీజన్ లో పాల్గొనే వాళ్ళ జాబితాలో ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక సెలబ్రెటీ పేరు కూడా బయటకు వచ్చింది. అతను మరెవరో కాదు ప్రముఖ ఆర్జె కమ్ యాంకర్ నిఖిల్. నిహారిక కొణిదల కి క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్ కి గతంలో కూడా బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు బిబి హౌస్ లోకి వెళ్లలేకపోయినా కూడా ఈసారి బిబి వారు భారీ మొత్తం ఆఫర్ చెయ్యడం తో హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు నిఖిల్. అయితే ప్రస్తుతం నిఖిల్ సురేఖ వాణి కూతురు సుప్రీతతో డేటింగ్ లో ఉన్నడని టాక్ వినిపిస్తుంది. ఇక సురేఖ వాణి కూడా హౌస్ లోకి రాభోతుందని తెలిసి అత్త అల్లుడు కలిసి ఎంత రచ్చ చేస్తారో బిగ్ బాస్ హౌస్ లో అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.