ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులానిలో…. ఇంత మార్పా..!

ఒకప్పటి హీరోయిన్ సింధు తులాని ఏం చేస్తుందో తెలుసా? ఐతే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. దీనితో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గే సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉండే సింధు తులాని ముంబై బామ్మ అయినా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళ్, కన్నడ భాషల్లో చేసి తెలుగు హీరోయిన్ గానే ఎక్కువగా పాపులారిటీ తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

సింధు స్వస్థలం ముంబయి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు. తండ్రి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తుంది. సింధుకు ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు నేహా. తను ప్రస్తుతం ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తుంది. అంతేకాదు పార్ట్ టైం డీజే గా కూడా పనిచేస్తుంది. సింధు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తరువాత థియేటర్ కోర్స్ చేసింది. చదువుకునే రోజుల్లోనే డ్రామాలు వేస్తూ నటనపై ఆసక్తి పెంచుకుంది.

మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీం కు మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నార్త్ ఇండియా భామ బాలీవుడ్ లో మొహబ్బతే సినిమాలో హీరోయిన్ షమితా శెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసింది. అయితే కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తూ డైరెక్టర్ గుణ్నం గంగరాజు ముంబై వెళ్ళగా అక్కడ ఆయనకు సింధు కనిపించింది. వెతకపోయినా తీగ కాలికి తగిలినట్లు ఆయన మరెవరిని పట్టించుకోకుండా సింధు తులానిని ఎంపిక చేశాడు. ఆ విధంగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా అతను ఒక్కడు సినిమా సింధుకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. తమిళంలో సింబు హీరోగా మన్మధ సినిమా చేసి కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. సింధు తులాని భర్త నార్త్ ఇండియన్. అతడు ఐటి ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. సుందికి శ్వేత అనే కుమార్తె ఉంది. సింధు తులాని స్పెషాలిటీ ఏంటంటే… చాలామంది పెళ్లి అయిన తరువాత ఇండస్ట్రీకి చాలాకాలం దూరమవుతారు. కానీ ఈమె మాత్రం పెళ్లయిన ఏడాదికే తిరిగి మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. అలాగే పలు సీరియల్ లో కూడా నటిస్తుంది.