జైలర్ సినిమా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి…ఎందుకో తెలుసా…!!

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు తెలుగులో అక్కడక్కడ కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన ఓవరాల్ గా సినిమా బాగుందని అంటున్నారు. ఇక నిన్న‌ రిలీజ్ అయిన చిరు సినిమా భోళా శంకర్ సినిమా టాక్ అటు ఇటు గా ఉంది కాబట్టి జైలర్ సినిమాకు అది కలిసి వచ్చే అవకాశం అవుతుంది. జైలర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ రజినీ ఫ్యాన్స్ ని మెప్పించింది.

అయితే కొందరు ఫస్ట్ హాఫ్ బాగుందని అంటే మరికొందరు సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు. ఏదేమైనా రజినీ జైలర్ సినిమా ఇంతకుముందు వచ్చిన మూడు నాలుగు సినిమాల కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో జైలర్ సినిమా హైలెట్ అయినా అంశాల గురించి మాట్లాడుకుంటే ముందుగా అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్ గురించి చర్చిస్తున్నారు. స్టార్ హీరోల‌ సినిమాలకు అది కూడా అభిమాన హీరోల సినిమాలకు మ్యూజిక్ ది బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తాడు. కమల్ విక్రం సినిమా కోసం అనిరుధ్‌ ఎలా అయితే అదరగొట్టాడు జైలర్ సినిమాకు కూడా రజినీ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టేలా మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్.

అనిరుద్‌ను నమ్మి ప్రాజెక్ట్ చేతిలో పెడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అనేది జైలర్ మ్యూజిక్ చూస్తే తెలుస్తుంది. అయితే జైలర్ సినిమా మ్యూజిక్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు. అలా ఎందుకు అంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అందువల్ల దేవరా మ్యూజిక్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.