ప్ర‌భాస్‌కు ఆ ప్లేస్‌లో స‌ర్జ‌రీ… టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. ఇటీవ‌ల ఆది పురుష్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించిన‌ ప్ర‌భాస్‌. సెప్టెంబర్ 28 సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ప్రభాస్ పర్సనల్ విషయానికి వెళితే ప్రభాస్ ఎవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంటు ఇప్పటికే ప‌లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుస‌ మూవీస్ తో బిజీగా ఉంటున్న ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్నాడట. కాగ సలార్ మూవీ షూటింగ్‌ కంప్లీట్ కాగానే ప్రభాస్ మోకాళ్ళకు సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సర్జరీ తర్వాత ప్రభాస్ కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటాడట. దీనిపై ప్రెజెంట్ ఎటువంటి అనౌన్స్మెంట్ రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్ వైర‌ల్ అవ‌డంతో ఫ్యాన్స్ పరేషాన్​ అవుతున్నారు.