వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. అందుకు సంబంధించి విషయాలు తెలుసుకుందాం.

భోళా శంకర్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం వైవా హర్ష ను కూడా పాపులర్ చేస్తున్న సంగతి తెలిసిందే ..ముఖ్యంగా చిరంజీవి పలు విషయాలను రివిల్ చేస్తూ వైవా హర్షి గురించి మాట్లాడారు.. చిరంజీవి మాట్లాడుతూ తన క్లాస్మేట్ అందరూ ఈమధ్య మా పాత స్నేహితులంతా కలిశాము.. అక్కడే చాలా సేపు మాట్లాడుకున్నాము కానీ ఆ రోజు వరకు వైవా హర్ష తన స్నేహితుడు కుమారుడని మాత్రం తెలియదు.. నా స్నేహితుడు హర్ష తన కుమారుడు అని నాకు తెలుసు అని చెప్పలేదట. అప్పటికే తాను చాలా సినిమాలలో చేయడంతో తనకు తెలుసు అని అనుకున్నారట.

 

అయితే హర్ష కేవలం నటుడుగా మాత్రమే తెలుసని తెలిపారు చిరంజీవి.. చిరంజీవి గారి స్ఫూర్తితోనే హర్ష కూడా ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు సంపాదించుకున్నారని తెలియజేయడం జరిగింది. ఈ విషయం విన్న చిరంజీవి చాలా సంతోషంగా ఉందంటూ తెలిపారు.. తన స్నేహితుడి బిడ్డ సినిమా నటుడు అవ్వడం తన కూడా చాలా ఆనందంగా ఉందని తెలిపారు.. ఇకపై వైవ హర్ష గుర్తు పెట్టుకుంటానని కూడా చిరంజీవి తెలియజేయడం జరిగింది. వైవా హర్ష చిరంజీవి కేవలం చిరంజీవి స్నేహితుడు కుమారుడట..