బాలయ్య సినిమాలో బాలనటిగా, బాల నటుడుగా చేసిన స్టార్ హీరో.. స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడుగా టాలీవుడ్లో అడుగుపెట్టిన నట‌సింహం నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాంటి బాలకృష్ణకు కెరీర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే సమయంలో బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకులలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఒకరు. గతంలో బాలయ్య- కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటేనే తిరుగులేని క్రేజ్‌ ఉండేది.

బాల‌య్య‌కు తొలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనత కూడా కోడి రామకృష్ణ కే దక్కింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మంగమ్మగారి మనవడు ఏకంగా మూడు థియేటర్ల్లో సంవత్సరం పాటు ఆడింది ఈ రికార్డు బాలయ్య కెరీర్ లోని ఇప్పటికే చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది.కోడి రామకృష్ణ – బాలయ్య కాంబినేషన్లో 1989లో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాలగోపాలుడు. పివిఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎమ్మార్పీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ, సుహాసిని జంటగా నటించగా… రాజ్‌కోటి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బాలన‌టుడిగా కనిపించారు. బాలయ్య పట్టుబట్టి ఈ పాత్రకు కళ్యాణ్ రామ్‌ను ఎంపిక చేయటం మ‌రో విశేషం.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రాజు అనే బాల న‌టుడిగా నటించారు. అలాగే సీనియ‌ర్‌ హీరోయిన్ రాశి కూడా ఈ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో కనిపించింది. రాశి బాలనటిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. .ఇక బాలగోపాలుడు సినిమాలో బాలనటిగా నటించిన రాశి తర్వాత అదే బాలయ్యకు జోడిగా క్రిష్ణబాబు సినిమాలో నటించటం విశేషం. అలాగే ఎన్టీఆర్‌కు బడిపంతులు సినిమాలో మనవరాలుగా కనిపించిన శ్రీదేవి.. తర్వాత అదే ఎన్టీఆర్‌కు జోడిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

ఇలా బాల‌య్య హీరోగా వచ్చిన బాలగోపాలుడు సినిమాలో బాలనటిగా నటించిన రాశి తర్వాత క్రిష్ణ బాబు సినిమాలో బాలయ్యకు జంటగా నటించింది. అదేవిధంగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలయ్యకు కొడుకుగా తన తండ్రి హరికృష్ణ పాత్రలో బాలయ్యతో కలిసి నటించడం మరో విశేషం. ప్రస్తుతం నట‌సింహం బాలయ్య భగవంత్ కేస‌రి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఇక దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.