భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ మేనియా చూపించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా భోళా శంకర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక నిన్నటి రోజు అర్ధ రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.ఓవర్సీస్ నుంచి కూడా టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం ట్విట్టర్లో భోళా శంకర్ సినిమా గురించి పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Bhola Shankar (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

భోళా శంకర్ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ టీజర్ సాంగ్స్ కూడా మెహర్ రమేష్ బాగానే తీశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నా నటించిన కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కంటే భోళా శంకర్ సినిమాకి కాస్త బజ్ ఎక్కువగా వినిపించిందని చెప్పవచ్చు.. స్టోరీ విషయానికి వస్తే కలకత్తాలో ట్యాక్సీ డ్రైవర్ గా భోళా శంకర్ అతని చెల్లెలు కీర్తి సురేష్ ఉంటారు..అయితే ఆమెను మంచిగా చదివించి ఆమెకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని తాపత్ర పడుతూ ఉంటారు అదే సందర్భంలో శంకర్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

అలా ఆడపిల్లలకి ఆపద వచ్చిందంటే శంకర్ ఆదుకుంటూ ఉంటారు.కలకత్తా నగరంలో ఎన్నో మిస్సింగ్ కేసులు మహిళలవి పెరిగిపోతూ ఉంటాయి దీని వెనుక ఉన్న కథ ఏంటి శంకర్ వల్ల శంకర్ చెల్లెలు ఇబ్బందిపడుతుంది ఆ సమయంలో శంకర్ తన సొంత అన్న కాదనే విషయాన్ని తెలుసుకుంటుంది.. ఇంతకు శంకర్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటనే కదా అంశంతో తెరకెక్కించారు.

కీర్తి సురేష్, చిరంజీవి మధ్య సెంటిమెంట్ సిన్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది. తమన్నా గ్లామర్ ట్రీట్ మరొకసారి అద్భుతంగా ఉందని తెలుస్తోంది. సెకండాఫ్ లో చివరి క్లైమాక్స్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం ఫస్ట్ ఆఫ్ యావరేజ్ సాంగ్స్ కొన్నిచోట్ల కామెడీ వర్కౌట్ అయింది రొటీన్ కథ రొటీన్ ఫ్లాట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కామెంట్స్ చేయగా.. ఎలాంటి హైట్ లేకుండా వెళ్తే డీసెంట్ హిట్ అని చిరంజీవి లుక్స్ చాలా దారుణంగా ఉన్నాయని వాటి గురించి అసలు అడగకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మెగా అభిమానులకు తప్ప మరెవరికి నచ్చదని కామెంట్స్ వినిపిస్తున్నాయి

.