విజ‌య్‌-స‌మంత `ఖుషి` మూవీకి ముంద‌నుకున్న‌ టైటిల్ ఏంటో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `ఖుషి`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.. త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌మోష‌న్స్ తో మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. ఖుషి సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు సంబంధం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని.. కానీ, అందులో నిజం లేదంటూ శివ నిర్వాణ తేల్చేశారు. తాను మూడేళ్ల క్రితమే ఈ సినిమా క‌థ రాసుకున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

అలాగే ఈ సినిమాకు ఖుషి టైటిల్ నే ఎందుకు పెట్టారు..? అన్న ప్ర‌శ్న‌కు కూడా ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. “ఈ సినిమాకు మొద‌ట `సరదా` అని.. అలాగే మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడే ఖుషి టైటిల్ ను ఫిక్స్ చేశాం. క‌థ‌కు బాగా ఆ టైటిల్ బాగా సెట్ అయింది“ అంటూ శివ నిర్వాణ పేర్కొన్నారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.