తెలుగులో టాప్ హీరోల నుంచి క్యారెక్టర్… ఆర్టిస్టులుగా మారిన వ్యక్తులు వీళ్లే….!!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా చేసినవారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. మొదట్లో జగపతిబాబు హీరోగా సినిమాలు చేశాడు. తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలియాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తండ్రి పాత్రల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయాడు. శ్రీకాంత్ మొదట్లో విలన్ గా నటించిన ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశాడు.

ఇక ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు. నరేష్ కూడా హీరోగా మరియు కామెడి చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. నరేష్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ మంచి పేరుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ అయ్యంగర్ తెలుగు సిని ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.