విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే వ‌చ్చాడు. విజ‌య్ గ‌త చిత్రం లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా కూడా ఆయ‌న మార్కెట్ ఏ మాత్రం డౌన్ కాలేదు. ప్ర‌స్తుతం చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు.

త్వ‌ర‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో విజ‌య్‌, స‌మంత జంట‌గా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ సినిమా నిర్మిత‌మైంది. సెప్టెంబ‌ర్ 1న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఖుషి ప్రేక్ష‌కుల ముందు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడే గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా, ప‌రశురామ్ తో ఓ సినిమా చేసేందుకు విజ‌య్ క‌మిట్ అయ్యాడు.

ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల‌కు త‌గ్గ‌కుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మొట్ట‌మొద‌ట ఎంత సంపాదించాడో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేదు. ఎందుకంటే, విజ‌య్ మొద‌టి సంపాద‌న జెస్ట్ రూ. 500. సినిమాల్లోకి రాక‌ముందు విజ‌య్ కొంత మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడ‌ట‌. అలా అప్పుట్లో అతనికి రూ.500 ఇచ్చేవార‌ట‌. అదే విజ‌య్ తొలి సంపాద‌న‌. ఆ త‌ర్వాత‌ యాక్టింగ్ ట్రైనర్ గా కూడా విజ‌య్ వర్క్ చేశాడు. ఆ టైమ్ లో రూ.35,000 శాలరీ తీసుకున్న‌ట్లు విజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.