పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉంది. అందుకే దర్శకులు, నటీనటులు, నిర్మాతలు అందరూ పాన్-ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయితే వెంటనే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను తెలుగు, తమిళం, కన్నడ నటీనటులు శాసిస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా పాన్-ఇండియా నటీనటుల సర్వే ప్రకారం, టాప్ 10లో నలుగురు తెలుగు నటులు, ముగ్గురు తమిళ నటులు, ముగ్గురు హిందీ నటులు చోటు సంపాదించుకున్నారు.
అయితే ఆశ్చర్యకరంగా నటుడు విజయ్ టాప్ 1 స్థానంలో నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విజయ్ కి భారతీయ ప్రేక్షకులు నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చారు. వాస్తవానికి, విజయ్‌కి ఒక్క పాన్-ఇండియా హిట్ లేదు, కానీ అతనికి భారీ అభిమానుల సంఖ్య ఉంది. విజయ్ తర్వాత ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నాడు. షారుక్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. షారుక్ పఠాన్ విజయంతో టాప్ 10లో అడుగుపెట్టగా.. మరో తెలుగు నటుడు ఎన్టీఆర్ కూడా టాప్ 5లో చేరి.. నాలుగో స్థానంలో నిలిచాడు. అజిత్ టాప్ 5లో నిలవడం విశేషం.
గతంలో టాప్ 5లో ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఈసారి ర్యాంకింగ్స్ కోల్పోయారు. అల్లు అర్జున్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతను ఒకసారి టాప్ 3 స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్ తర్వాత సల్మాన్ ఖాన్ ఉన్నాడు. అతను ఏడో ర్యాంక్ సాధించాడు. రామ్ చరణ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
అక్షయ్ కుమార్ తొమ్మిదో స్థానంలో ఉండగా, సూర్య పదో స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ సర్వే ఫలితాలు ప్రతి నెలా మారవచ్చు. పైభాగంలో ఉన్నవారు పడిపోవచ్చు, దిగువన ఉన్నవారు పైకి ఎదగవచ్చు. కన్నడ స్టార్ యష్ గతంలో టాప్ 10లో ఉన్నాడు, కానీ అతను ఇప్పుడు ఏ చోటా లేడు.