ఖుషి అఫీషియల్ రన్ టైం వచ్చేసింది.. సెన్సార్ డీటెయిల్స్ కూడా..!

యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌ముఖ పాత్ర‌ల‌లో నటించిన మూవీ ఖుషి. శివా నిర్వాణ‌ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తరికేక్క‌నున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటితో మంచి రెస్పాన్స్ సాధించిన ఖుషి మూవీ మంచి హైప్‌ని తెచ్చుకుంది. ఇటీవల జరిగిన ఖుషి మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్‌లో విజయ్ దేవరకొండ – సమంత కలిసి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరింత హైప్ పెంచింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ వారి రివ్యూతో పాటు మూవీ రన్ టైం కూడా లాక్ అయిపోయింది.

ఈ సినిమాను చూసిన సెన్సార్ వారి నుండి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అలాగే అఫీషియల్ రన్ టైం కూడా 2 గం. 45 ని అట. ఒకరకంగా ఇది లెంత్తి మూవీ అని చెప్పవచ్చు. మరి అటు విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సమంత ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజైన‌ తర్వాత ప్రేక్షకుల్లో ఏ రేంజ్‌లో కనెక్ట్ అవుతుందో..? సక్సెస్ సాధిస్తుందో..? లేదో..? చూడాలి.