చిరంజీవి గ్యారేజ్ లో ఇన్ని ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయా.. వాటి ధ‌ర‌లు తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా హీరోగా నిల‌దొక్కుకుని టాప్ స్టార్ గా ఎదిగిన చిరంజీవి.. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుండి ఇండ‌స్ట్రీని ఏలుతూనే ఉన్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. అయితే నేడు చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌రియు అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. మ‌రోవైపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న‌కు సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. చిరంజీవి అస‌లు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆయ‌న జ‌న్మించారు. న‌టుడిగా 150కి పైగా చిత్రాలు చేశారు. రాజ‌కీయాల్లో ఫెయిల్ అయినా నట‌నారంగంలో ఆయ‌నొక సంచ‌ల‌నం. వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నాడు. అలాగే అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. రియ‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ఇక‌పోతే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న కార్ల ప్రేమికుల్లో చిరంజీవి ఒక‌డు. ఈయ‌న గ్యారేజ్ లో ఎన్నో ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. వాటి ధ‌ర‌లు తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే. చిరంజీవి ద‌గ్గ‌ర ఉన్న అత్యంత కాస్ట్లీ కార్స్ లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఒక‌టి. అత్యంత ల‌గ్జ‌రీగా ఉండే ఈ కారు ఖ‌రీదు రూ. 10.5 కోట్లు ఉంటుంద‌ట‌. అలాగే రూ. 4 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్, రూ. 2.2 కోట్లు ఖ‌రీదు చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ. 2 కోట్లు ఖ‌రీదు చేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు చిరంజీవి గ్యారేజ్ లో సేద తీరుతున్నాయి. ఇక చిరు వ‌ద్ద‌ ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని విలువ రూ. 30 కోట్లు ఉంటుంద‌ని అంటున్నారు.