అటు ఇటూ కాకుండా రెంటికి చెడ్డ రేవ‌డిలా మారిన ఆలీ…!

కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అలీ ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. నిన్న మొన్నటి వరకు కూడా సాఫీగా సాగిన అలీ సినీ కెరీర్ ప్రస్తుతం కాస్త లోగా ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ని అని చెప్పుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న అలీ.. తన ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీలో కాకుండా వైసిపి పార్టీలో చేరడం పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు.

 

ఇక వైసిపి వాళ్లు కూడా ఏదో పదవి ఇస్తామని ఆశ పెట్టడంతోనే అలి ఆ పార్టీలో చేరాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అక్కడ అలీని ఎవరు పట్టించుకోవడం లేదనేది వాస్తవం. దానికి తోడు అలీ ఆ పార్టీలో చేరకముందు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఏదైనా చిన్న రోల్ అయినా కచ్చితంగా నటించేవాడు. ఇక వైసిపిలో అలీ చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో వేటిలో ఆలీ కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలిని తీసుకుందాం అనుకున్న ఫాన్స్ మాత్రం ఒప్పుకోరు.

దీంతో ప్రస్తుతం రెండింటికి చెడ్డ రేవడిలా అలీ ప‌ర‌స్థితి మారింది. ఇక‌ రాజకీయపరంగా అలీకి అనుకున్న పోస్ట్ దక్కలేదు. దానికి తోడు సినిమాల్లో కూడా ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. అందుకే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అంటూ చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయం. ఇక కొంతమంది పవన్ ఫ్యాన్స్ పవన్ లాంటి మంచి మనిషిని మోసం చేసినందుకు అలీకి ఇలా జరగాల్సిందే అంటూ ఫైర్ అవుతున్నారు.