సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఎంత ధైర్యవంతురాలో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కెరీర్ పరంగా ఈమె సూపర్ సక్సెస్ అయింది. కానీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితం నాలుగేళ్లకే చెడింది. అయినాసరే సమంత కృంగిపోలేదు. ఈలోపే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కబలించినా.. సమంత బెదరలేదు.
అలాంటి సమంత లిఫ్ట్ కు భయపడుతుందని మీకు తెలుసా..? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విషయాన్ని సమంత స్వయంగా బయటపెట్టింది. లిఫ్ట్ లో వెళ్లడానికి తనకు చాలా భయమని, ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతంలో లిఫ్ట్ ఎక్కాలంటే షివరింగ్ వచ్చేస్తుందని సమంత పేర్కొంది. దీంతో సమంత కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో సమంత `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేసింది. రాజ్ & డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.