`జైల‌ర్‌` రిలీజ్ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ర‌జ‌నీనా మ‌జాకా!!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ ప‌డ‌లేదు. అయినాకూడా ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు అన‌డానికి తాజాగా ఓ ఉదాహ‌ర‌ణ తెర‌పైకి వ‌చ్చింది. మ‌రో రెండు రోజుల్లో ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. అలాగే ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించారు. ఆగ‌స్టు 10న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల కాబోతున్న జైల‌ర్ తో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇస్తాడ‌ని అభిమానులు ధీమాతో ఉన్నారు. మ‌రోవైపు జైల‌ర్ బుక్సింగ్స్ రికార్డు స్థాయిలు జ‌రుగుతున్నాయి.

ఇదే త‌రుణంలో `జైల‌ర్‌` రిలీజ్ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు కొన్ని కంపెనీలు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాయి. ‘జైలర్’ రిలీజ్ రోజు ఉద్యోగులకు హాలిడేను ప్రకటించాయి. అంతేకాకుండా టిక్కెట్లను కూడా అందిస్తున్నార‌ట‌. బెంగళూరు, చెన్నైలోని కంపెనీలు మాత్రమే తమ ఉగ్యోగుల‌కు ఆ ఆఫ‌ర్ ను అందిస్తున్నాయ‌ని స‌మాచారం. ఈ విష‌యం ర‌జ‌నీ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ర‌జ‌నీనా మ‌జాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.