బ్రేకింగ్‌: హైద‌రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం.. మ‌ల్టీఫ్లెక్స్ ద‌గ్ధం

సినిమా ధియేటర్ నిర్మిస్తున్నారంటే థియేటర్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మేనేజ్మెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా చూసే టైంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎంతో మంది ప్రేక్షకులు ప్రాణాలకు అపాయం కలిగే ప్రమాదం ఉంది.

అందుకే థియేటర్ నిర్మించేటప్పుడు ఫైర్ సేఫ్టీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చందానగర్ ఏరియాలోని జేపీ సినిమాస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

శనివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఐదు అగ్నిమాపక ఫైరింజన్లు మంట‌లు ఆర్పుతున్నాయ‌ట‌. ఇప్పటికే థియేటర్లో 3 స్క్రీన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది.