రజనీకాంత్ కి తప్ప ఎవరికీ సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డు.. ఏంటంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలోనే కాకుండా బయట కూడా రజనీకాంత్ కి సేవ గుణం ఎక్కువే అని చెప్పాలి. 60 ఏళ్లు దాటినా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్బస్టర్ హిట్స్ ని అందుకుంటూ బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు రజినీ. ప్రస్తుతం రజనీకాంత్ తన ఒకో సినిమాకి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తమిళ సినిమాలో తెరకెక్కిన జైలర్ సినిమా విడుదల అయిన మొదటి రోజే రూ.52 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన నాన్ టాలీవుడ్ సినిమాలో రజిని కాంత్ సినిమా లే మూడు ఉన్నాయని చెప్పడం గమనార్హం.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన రోబో, రోబో 2.0, జైలర్ సినిమా లు రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి అరుదైన రికార్డులను సృష్టించాయి. ఈ సినిమా లు రెండు తెలుగు రాష్ట్రాలో రికార్డులు సృష్టించడమే కాకుండా రజినీకాంత్ కి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి. చాలా మంది హీరోలకు రజినీకాంత్ తన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆదర్శనంగా ఉంటాడు. ప్రస్తుతం మన సూపర్ స్టార్ పాన్ ఇండియా సినిమాలా దశగా అడుగులు వేస్తున్నారు.