60 ఏళ్ల ఏజ్‌లో 20 ఏళ్ల కుర్రాడే.. ఈ స్టార్ హీరోను గుర్తు ప‌ట్టారా

పైన కనిపిస్తున్న ఈ ఫోటోలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. ఆయన 60 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా 20 ఏళ్ల కుర్రాడు లాగా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిగా పోటీ ఇస్తున్నాడు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఇప్పుడు రీఎంట్రీ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రేమ కథ చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్ త్రిల్లెర్స్ తో పాటు భక్తి రస చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

ఇప్పుడైనా ఎవరో గుర్తుపట్టారా..? అత‌డే న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున‌. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి పరిచయమైన నాగార్జున. విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ప‌లు సినిమాల‌లో నటించి మెప్పించిన ఈయన కెరీర్ పరంగా గీతాంజలి, శివ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి. అప్పట్లో ఈ సినిమాలు యూత్ ను ఆకట్టుకున్నాయి.

కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా భక్తి సినిమాలలోనూ నాగార్జున తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇటీవల ద గోస్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్న నాగార్జున కొంతకాలంగా తెరపై కనిపించలేదు. తాజాగా మరో సినిమాతో నాగార్జున ఎంట్రీ ఇవబోతున్నాడు అంటు న్యూస్ వైరల్ అవుతున్నాయి. మరో పక్క బుల్లితెరపై ప్రసారం అయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు నాగార్జున దాదాపు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.