‘ గుంటూరు కారం ‘ లో అంద‌రూ షాక్ అయ్యే ఇంట్ర‌స్టింగ్ రోల్ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరి ఆమె ప్లేస్ లో ఎంటర్ అయింది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కనిపించబోతుందట. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

త్రివిక్రమ్ – మహేష్ బాడీ లాంగ్వేజ్ కి, ఫేమ్ కి తగ్గ విధంగా మహేష్ క్యారెక్టర్‌ని సినిమాలో డిజైన్ చేశాడట. ఇక దీంతోపాటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఇది విలన్ పాత్ర అని తెలుస్తుంది. ఈ పాత్ర చాలా వైల్డ్ గా ఉండబోతుందని.. సెకండ్ హాఫ్ డ్రైవ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ పాత్రని చాలా వైలెంట్ గా త్రివిక్రమ్ డిజైన్ చేశాడట.

 

మరి ఈ పాత్రలో ఏ నటుడు కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మూవీ టీమ్‌ హారిక్ అండ్‌ హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపొందుతుంది. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 28వ సినిమా. జనవరి 13, 2024న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.