రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..

ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తుంది.

మంగళవారం తన అభిమానుల సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులతో విజయ్ సమావేశమయ్యాడు. విజయ్ తన రాజకీయ ఎంట్రీ గురించి ఆ సంఘంలోని సభ్యులతో చర్చించడం విశేషం. రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడం కోసం సినిమాలకు ఆయన పుల్ స్టాప్ పెడుతున్నట్లు విజయ్ ఈ సందర్భంగా తన అభిమానులకు చెప్పినట్లు తెలుస్తుంది. అలానే విజయ రాజకీయ ఎంట్రీకి చేయాల్సిన పనులన్నీ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ అభిమానులు కూడా విజయ్ కి రాజకీయాల్లో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.

విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో ‘ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరిగా విజయ్ దళపతి 68 వ సినిమాలో నటించనున్నాడు. రాజకీయాలోకి వెళ్తే బిజీగా ఉంటాడు కాబట్టి దాదాపు మూడేళ్ల వరకూ విజయ్ సినిమాలకు దూరంగా ఉన్నాడని సమాచారం. దాంతో విజయ్ నటించిన లియో సినిమా కోసం అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విజయ్, అనిరుధ్ పాడిన’ నా రెడీ…’ సాంగ్ విడుదల అయింది. ఈ సాంగ్ లో విజయ్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. లియో సినిమా విజయ్‌కు ఎంతటి సక్సెస్ను అందిస్తుందో వేచి చూడాల్సిందే.