పెళ్లి త‌ర్వాత లైఫ్ ఎలా ఉండాలో చెప్పేసిన‌ విజ‌య్.. రౌడీ బాయ్ రియ‌ల్ లైఫ్‌లోనూ రొమాంటిక్కే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం త‌న ఆశ‌ల‌న్నీ `ఖుషి`పైనే పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజ‌య్ దేర‌కొండ‌కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుద‌ల‌కు రెడీ అవుతోంది. సెప్టెంబ‌ర్ 1వ తేదీన తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాస‌ల్లో ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. ఇందులో భాగంగానే `ఆరాధ్య‌` అంటూ సాగే ఖుషి సెకండ సాంగ్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇంత‌కుముందు ఈ సినిమా నుంచి వ‌చ్చిన ‘నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసింది. అయితే `ఆరాధ్య‌` సాంగ్ దానికి పోటీ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో విజ‌య్‌, స‌మంత కెమిస్ట్రీ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంది.

అయితే ఈ సాంగ్ విడుద‌ల సంద‌ర్భంగా విజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ క్ర‌మంలోనే పెళ్లి త‌ర్వాత త‌న్ లైఫ్ ఎలా ఉండాలో చెప్పేశాడు. `ఖుషి సినిమాలో నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఆరాధ్య ఒక‌టి. ఎంతో బ్యూటిఫుల్ గా సాగే ఈ సాంగ్ లో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ, పెళ్లి త‌ర్వాత మాత్రం నా లైఫ్ కూడా ఈ సాంగ్ లో ఉన్న‌ట్లే ఉండాలని కోరుకుంటున్నా` అంటూ విజ‌య్ చెప్పుకొచ్చాడు. దీంతో రౌడీ బాయ్ రియ‌ల్ లైఫ్‌లోనూ రొమాంటిక్కే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు అన్నా ర‌ష్మిక‌తో పెళ్లెప్పుడు..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.