చీరకట్టులో హాట్ పోజులు.. సెగలు పుట్టిస్తున్న శివాత్మిక లేటెస్ట్ పిక్స్!

ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ వదులుతూ తెగ రచ్చ చేసేస్తుంది. అటు ట్రెడిషనల్ గా ఇటు ట్రెండీగా దర్శనమిస్తూ అందరినీ మైమరపిస్తుంది. తాజాగా శివాత్మిక చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. శివాత్మిక సెగలు పుట్టిస్తున్న చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు సినీ కేరిర్ గురించి మాట్లాడుకుంటే శివాత్మిక కీలక పాత్ర పోషించిన రంగమార్తండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శివాత్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వచ్చాయి. ఇక గత ఏడాది ఈ అమ్మడు నటించిన ‘పంచతంత్రం ‘ సినిమా మాత్రం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలానే తమిళ్ డబ్బింగ్ సినిమా అయిన ‘ఆకాశం’ కూడా పెద్దగా టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళం లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. మరి తమిళ్ లో అయిన శివాత్మికకి మంచి బ్రేక్ ఇచ్చే మూవీ తగులుతుందేమో చూడాలి.

ఎలా అయితేనే ఈ అమ్మడు అటు తెలుగులో ఇటు తమిళ్ లో నటించే అవకాశం దక్కించుకుంటుంది. ఇక సోషల్ మీడియా లో తన గ్లామరస్ ఫొటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ ని చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ప్రకృతి అందాలకు తన అందాలను జోడించి మరింత గ్లామర్ గా కనపడితుంది ఈ చిన్నది. సంప్రదాయమైన చీరకట్టులో శివాత్మికను ‘ఎంత ముద్దుగా’ ఉన్నవో అని పొగుడుతున్నారు. శివాత్మిక చీరలో గ్లామర్ పంట పండిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.