పాన్ ఇండియా హీరోగా శ్రీకాంత్ తనయుడు.. డైరెక్టర్ అతనే..!

టాలీవుడ్ లో కుటుంబ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ అప్పట్లో మంచి ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..తన తనయుడు రోషన్ చిన్నప్పటి నుంచే సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పెళ్లిసందD, నిర్మలా గార్మెంట్ సినిమాలతో హీరోగా పరిచయమై కాస్త గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా కథపరంగా కాస్త పాజిటివ్ మార్కులే వచ్చాయి.

Roshann To Star Alongside Mohan Lal in Vrushabha | cinejosh.com

అయినా కూడా రోషన్ చుట్టూ ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శక నిర్మాతలు అలాగే ఇతర భాష దర్శకులు కూడా ఆయన వెంటపడుతున్నారు. అయితే రోషన్ కు వచ్చిన అవకాశాలను సున్నితంగా తిరస్కరించుకుంటూ వచ్చారు.. తాజాగా వైజయంతి బ్యానర్ పై ఒక మూవీకి కమిట్ అయ్యాడు. ఆ సినిమాతో పాటు నందకిషోర్ దర్శకత్వంలో కూడా ఒక చిత్రంలో నటించబోతున్నారు.అయితే ఇవి రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో
ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా కన్నడ దర్శకుడు నందకిషోర్ ఆయనతో నటిస్తున్న చిత్రం కన్ఫామ్ గా రోషన్ కి పాన్ ఇండియా హీరో అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయట. ఇంకా ఈ సినిమాలో రోషన్ కి తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నాడనీ సమాచారం. ఈ సినిమా చాలా ఆలస్యం అవుతోందని అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారందరూ సంతృప్తి పడేలా ఈ సినిమా రూపొందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రోషన్కు ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్ అవుతుందని రోషన్ సన్నిహితులు అంటున్నారు.

 

ఇక వైజయంతి మూవీ బ్యానర్ పై వస్తున్న రోషన్ సినిమా కూడా మంచి పాన్ ఇండియా మూవీ అవుతుందని అంటున్నారు.అలాగే ఈ సినిమాకి అద్వైతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో విభిన్నమైన లవ్ స్టోరీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.