భర్త గుట్టు రట్టు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!

మొట్టమొదటిగా యాంకర్ గా పరిచయమై ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నేహా చౌదరి. ఈమె బిగ్ బాస్ షోలో మూడు వారాలే కొనసాగింది. అయినా ప్రేక్షకుల్లో ఆదరణ బాగానే సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను ఇంజనీర్ చదువుతున్న సమయంలో ప్రేమించి అనిల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. నేహా చౌదరి.అయితే అనిల్ జర్మనీలో జాబ్ చేయడం నేహా కూడా జర్మనీ వెళ్లిపోయింది. అక్కడ కూడా తను తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావటానికి ఎప్పటికప్పుడు తన ఫోటోలను ప్రేక్షకులకు చేరువచేస్తూ ఉంటుంది. తనే కాదు తన భర్తతో కూడా కొన్ని వీడియోలను ఫోటోలను తీసి వాటిని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

This Bigg Boss beauty to marry soon

అయితే తాజాగా నేహా భర్త గురించి చేసినటువంటి ఒక పోస్ట్ అభిమానులకు కంగారు పెట్టిస్తోంది. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే ఎంతో ద్వేషిస్తున్నాను. బహుశా దీన్నే నేమో పెళ్లి అంటారు. నువ్వు కార్ డ్రైవింగ్ నన్ను చెయ్యనివ్వకుండా చేసిన.. చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్ని తిననివ్వకుండా నువ్వు మాత్రమే తింటున్నా.. నేను చెప్పిన పని ఏది చేయకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం..ఒకవేళ నేను ఏదైనా ఇది చెయ్యొద్దు అని చెప్పిన చెయ్యనని ప్రామిస్ చేస్తావు కానీ ఐదు నిమిషాలకే మళ్లీ చేస్తావు అయినా కూడా నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటా

Bigg Boss 6 Telugu Contestant Neha Chaudhary Gets Married To Her Boyfriend Anil - Filmibeat

ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించే విధానానికి నేను ఫిదా అయ్యాను కాబట్టి నిన్ను ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్వు నావాడివి అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును రివిల్ చేసింది. ఆ పోస్ట్ ని చూసిన వారందరూ నేహా కి తన భర్త అంటే చాలా ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anchor Neha (@chowdaryneha)