ఆ స్టార్ హీరోకి విడాకులు ఖాయమంటూ వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్

సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అయ్యారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈయన గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పి వార్తలో నిలిచారు. అయితే చాలా వరకు వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సమంత, నాగచైతన్య విడిపోతారని వారి పెళ్లికి ముందే వేణు స్వామి చెప్పారు. అలానే జాతకం ప్రకారం చిరంజీవి కూతురు శ్రీజ ఆమె బాబాయ్ పవన్ కళ్యాణ్ లానే మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందని వేణు స్వామి చెప్పారు. అయితే ఆయన చెప్పినవి చాలా వరకు జరగడంతో చాలా మంది ఆయనను నమ్ముతారు.

తాజాగా వేణు స్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. త్వరలోనే మరో స్టార్ జంట విడిపోవడం ఖాయం అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేసారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ చాలాకాలంగా వేరుగా ఉంటున్నారు. కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ వల్ల వారిద్దరూ కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. వీరిద్దరి దూరంగా ఉండటం వల్ల మనస్పర్ధలు ఇంకా ఎక్కువైపోతున్నాయి.

అందుకే వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వేణు స్వామి తెలిపాడు. నాగచైతన్య, సమంత జంటలానే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంట కూడా విడిపోవడం ఖాయం అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు వేణు స్వామి. ఈ విషయం తెలిసిన వెంటనే చాలామంది వేణు స్వామి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఎంతసేపు ఎదుటి వాళ్ళు చెడు కోరుకోవడమే తప్ప నోటినుండి మంచి మాటలు రావా అంటూ వేణు స్వామిని తిట్టిపోస్తున్నారు. మరికొందరేమో ఇప్పటివరకు వేణు స్వామి చెప్పినవన్నీ జరిగాయి ఇది కూడా కచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.