`క్లిన్ కారా`ను చూడాలంటే కండీష‌న్స్ అప్లై అంటున్న‌ ఉపాస‌న.. మరీ ఓవ‌ర్ చేస్తున్నారే!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌త‌లు పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల త‌ర్వాత పేరెంట్స్ గా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాస‌న హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. జూన్ 30న మెగా లిటిల్ ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది.

పాపకు `క్లిన్ కారా` అని నామ‌క‌ర‌ణం చేశారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అంతేకాదు.. క్లిన్ కారా పేరిట ఫ్యాన్ పేజీల‌ను కూడా ఓపెన్ చేసేశారు. ఈ సంగ‌తి ప‌క్క‌న ప‌డితే.. రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు ఇంత‌వ‌ర‌కు త‌మ పాప‌ను ఎవ‌రికీ చూపించ‌లేదు. అయితే క్లిన్ కారాను చూసేందుకు స్టార్ సెల‌బ్రెటీలు, బంధువులు మ‌రియు సన్నిహితులు ఇంటికి వెళ్తుండ‌గా.. ఉపాస‌న కండీష‌న్స్ అప్లై అంటోంది.

త‌మ లిటిల్ ప్రిన్సెస్ ను చూడాలంటే ఖచ్చితంగా కొన్ని కండీష‌న్స్ పాటించాల‌ని చెబుతుంద‌ట‌. అవేంటంటే.. ఇప్పుడే పుట్టిన బేబీ కాబ‌ట్టి.. క్లిన్ కారా వ‌ద్ద‌కు ఎవ్వ‌రినీ ఫోన్స్ తీసుకెళ్ల‌వ‌ద్ద‌ని చెబుతుంద‌ట‌. అలాగే ఇన్ఫెక్ష‌న్స్ సోక‌కుండా ఉండేందుకు ఓ స్పెష‌ల్ రూమ్ లో పాప‌ను ఉంచుతుంద‌ట‌. చూసేందుకు వ‌చ్చిన వారిని పాపను ట‌చ్ చేయ‌వ‌ద్ద‌ని కూడా చెబుతుంద‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కొందరు ఉపాస‌న తీరును త‌ప్ప‌బ‌డుతున్నారు. మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం త‌న బిడ్డ ఆరోగ్యం ప‌ట్ల స్పెష‌ల్ కేర్ తీసుకుంటే త‌ప్పేంటి అంటూ ఉపాస‌న‌కు మద్ద‌తుగా నిలుస్తున్నారు.