`పుష్ప 2`లో ఊర్వశి రౌటేలా స్పెష‌ల్ సాంగ్‌.. ఆమె రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్‌`ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా అల‌ర‌బోతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే పుష్ప తొలి భాగంలో స‌మంత చేసిన `ఊ అంటావా మామ` ఐటెం సాంగ్ ఎంత‌లా ఊపేసిందో వివ‌రించ‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అయితే పుష్ప 2 లో కూడా ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అల్లు అర్జున్ తో ఆడిపాడ‌బోతోంది. ఈ మ‌ధ్య కాలంలో ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారిన ఊర్వ‌శిని ఇటీవ‌లె పుష్ప 2 మేక‌ర్స్ కూడా సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. అయితే ఈ స్పెష‌ల్‌ సాంగ్ కోసం ఊర్వశి రౌటేలా ఎంత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిందో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, మూడు నిమిషాలు నిడివి ఉన్న సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ. 6 నుంచి 7 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అడిగింద‌ట‌. ఇప్పుడీ విష‌య‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. స‌మంత కూడా ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు.. అలాంటిది ఊర్వ‌శి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా అంటూ నెటిజ‌న్లు షాకైపోతున్నారు.