బేబీ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోస్..!!

హృదయ కాలేయం సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రంతో సంపూర్ణేష్ బాబు కూడా నటుడుగా పరిచయమయ్యారు.. ఇలాంటి కామెడీ టైమింగ్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ అయిన సాయి రాజేష్ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రైటర్ గా కూడా పలు చిత్రాలకు అవకాశం వచ్చిన పెద్దగా రిస్కులు చేయలేదు సాయి రాజేష్.. ఇక మధ్య మధ్యలో కలర్ ఫోటో చిత్రానికి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యారు.

Anand Deverakonda's next titled 'Baby' launched - TeluguBulletin.com

అలాగే తన శిష్యులను మరికొంతమందిని డైరెక్టర్గా పరిచయం చేసి సంపూర్ణేష్ బాబు తోనే మరికొన్ని చిత్రాలను తీయించారు ఇవన్నీ కూడా పరవాలేదు అనిపించుకున్నాయి.. అయితే బేబీ సినిమా కథ రాసుకున్నప్పుడు సాయి రాజేష్ ఈ కథను రాశారు అంటే ఎవరు నమ్మలేకపోయారట అంత కామెడీ సినిమా తీసిన ఇంత డెవలప్మెంట్ స్టోరీ ఎలా హ్యాండిల్ చేయగలరని చాలామంది అనుమానాలు మొదలయ్యాయట కానీ నిర్మాత SKN మాత్రం అతనిని గట్టిగా నమ్మారు.

సాయి రాజేష్ మొదటి ఈ కథ రాసుకున్నప్పుడు ఆనంద్ దేవరకంటే ముందుగా ముగ్గురు హీరోలకు ఈ కథ అనుకున్నారట వాళ్ళు ఈ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. అందులో ఒక హీరో కథ విన్న తర్వాత ఇంత పెద్ద రిస్క్ నేను చేయలేనని చెప్పేసారట మరొక హీరో ఆ నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేయగానే దర్శకుడు సాయి రాజేష్ అయితే అసలు చేయనని చెప్పారట..దీంతో ఈ విషయం విన్న సాయి రాజేష్ చాలా బాధపడినట్లు తెలిపారు. హృదయ కాలేయం వంటి కామెడీ సినిమాని చేసిన ఈయన ఇలాంటి చిత్రాన్ని తీయడమంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు.. అయితే ఇంతకీ ఆ ముగ్గురు అన్ లక్కీ హీరోల పేర్లు మాత్రం తెలుపలేదు.