టమాటాలను పెట్టకూడని చోట పెట్టుకున్న స్టార్ యాక్ట్రెస్.. సిగ్గు లేదా అంటూ ఫైర్!

బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరు ఊహించని, ధరించని విధంగా సరికొత్త అవుట్ ఫిట్స్ లో మెరిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఉర్ఫీ మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెరపై నటిగా కొనసాగింది. సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ చిత్ర విచిత్ర అవుట్ ఫిట్ ల బ్యూటీ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

సినీ అవకాశాల కోసం ఈ అమ్మడు చేసిన అట్టెంప్ట్స్‌ అన్నీ విఫలమయ్యాయి. ఉర్ఫీ అనుకున్న స్థాయిలో అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇక బుల్లితెర అవకాశాలతో సరిపెట్టుకున్న ఈ అమ్మడికి బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1లో అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరుణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్‌లో ఉర్ఫీ డిఫరెంట్ గ్లామర్, బోల్డ్ మాటల కారణంగా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. బిగ్‌బాస్ తరువాత ఈ అమ్మడు బోల్డ్ లుక్స్ తో మీడియాను ఆకర్షించే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది.

ఈ క్రమంలో గూగుల్ లో 2022 వ సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం దక్కించుకొని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లను వెన్నకి నెట్టేసింది. అయితే ఈసారి మాత్రం ఉర్ఫీ చాలా కొత్తగా అందరికీ షాక్ ఇచ్చే లుక్ లో కనపడింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. అందులో కోతేముంది అనుకుంటున్నారా. ఆ డ్రెస్‌ని ఒక వైపే వేసుకొని ఇంకోవైపు తన చేతితో ఎద అందాన్ని దాచుకుంటూ వయ్యారాలు పోయింది. అంతేకాకుండా ఇప్పుడు గోల్డ్ రేట్ ని తాకుతున్న టమోటాలను తన చెవులకు కమ్మలుగా పెట్టుకొని ‘టమాటా కొత్త బంగారం ‘ అంటూ కాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.