ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ప‌వ‌న్, ఎన్టీఆర్‌తో సినిమాలు కూడా చేసింది!

పైన ఫోటోలు చాలా సీరియ‌స్ లో లుక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ తో సినిమాలు కూడా చేసింది. ఇంకా ఆమె ఎవ‌రో గుర్తుకు రాలేదా.. అయితే నేనే చెప్పాస్తా.. ఈ క్యూటీ నివేతా థామస్.

1995లో చెన్నైలో జ‌న్మించిన ఈ అందాల సోయ‌గం.. మ‌ల‌యాళంలో బాల‌న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్‌మ‌న్‌` మూవీ నిదేతా థామ‌న్ తొలి చిత్రం. ఆ త‌ర్వాత నిన్ను కోరి, జై ల‌వ కుశ‌, 118, బ్రోచేవారెవరురా, వ‌కీల్ సాబ్ ఇలా అనేక చిత్రాల్లో న‌టించింది. త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమా చేసింది.

తెలుగులో చివ‌రిగా `శాకిని డాకిని` మూవీలో మెరిసింది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీకి ఆఫ‌ర్లు లేక‌పోయినా.. మ‌ల‌యాళంలో ఓ సినిమా చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో నివేతా చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది.