టాలీవుడ్ ఇండస్ట్రీని భవిష్యత్తులో ఏలే స్టార్ కిడ్స్ వీరే..

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సెలబ్రిటిల పిల్లలు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. అందుకే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరో, హీరోయిన్లతో సమానంగా నటనలో పోటీ పడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ లో టాలీవుడ్ ను ఏలే సెలబ్రిటీ స్టార్ కిడ్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• అల్లు అర్హ

స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘శాకుంతలం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్హ. మొదటి సినిమాతోనే తన నటనకి మంచి గుర్తింపు తెచ్చుకుందీ చిన్నారి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవరా’ సినిమాలో కూడా అల్లు అర్హ నటిస్తుంది. దాంతో అల్లు అర్జున్ కూతురు అర్హ ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ అవుతుంది ప్రేక్షకులకు ముందుగానే అర్హ జాతకం చెప్పేస్తున్నారు

• సితార

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ప్రముఖ పీఎంజే జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి న్యూయార్క్ టైమ్‌ స్క్వేర్‌లో మెరిసి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది సితార.

• అఖిరా, మోక్షజ్ఞ

అలానే పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించబోతున్నాడు. రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో అభయ్ రామ్, సితార అక్కాతముళ్లుగా నటించనున్నారని సమాచారం. ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోల పిల్లలు ఫ్యూచర్లో ఇండస్ట్రీని ఏలా బోతున్నారు.